వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా బుధవారం గొలుగొండ శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రంధాలయ అధికారి రాజబాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. అలాగే ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa