మే 1వ తారీకు నుండి 5వ తారీఖు వరకు చిత్తూరు జిల్లా తిరుపతిలో నిర్వహించిన సీఎం కప్ మహిళల ఆహ్వాన కబడ్డీ పోటీలలో విజయనగరం జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా మే 20, 21వ తేదీలలో నిర్వహించిన అండర్ 19 స్కూల్ గేమ్స్ లో విజయనగరం జిల్లా జట్టు తృతీయ స్థానాన్ని పొందిన నేపథ్యంలో విజయనగరం జిల్లా జట్టు విజయం సాధించేందుకు కీలకపాత్ర పోషించిన శృంగవరపుకోట పట్టణానికి చెందిన భత్తుల విజయను అలాగే కోచ్ తాతబాబులను స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు గురువారం బొడ్డవరలో గల ఆయన స్వగృహంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత సాధన చేసి, విజయనగరం జిల్లా జట్టుకు మరిన్ని విజయాలు చేకూరేలా కృషి చేయాలని తద్వారా శృంగవరపుకోట పట్టణానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.