మూడు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను అధికారులు పరిశీలించారు. గురువారం అమృత సరోవర్ కార్యక్రమంలో భాగంగా గజపతినగరం మండలంలోని జిన్నాం, లింగాలవలస, కెంగువ గ్రామాల్లో జరుగుతున్న చెరువు పనులను నీటిపారుదల శాఖ డిప్యూటీ డి. ఈ పాండు, ఎంపీడీవో పప్పు సుదర్శనం, ఏపీవో సి. హెచ్. రామారావులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూడు గ్రామాల్లో పనులు చురుకుగా జరుగుతున్నందుకు డి. ఈ పాండు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.