భోగాపురం మండలం దల్లిపేటకు చెందిన కిలిము తోటయ్య కుటుంబానికి సిఎంఎం సహాయనిధి ద్వారా ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గురువారం రూ. 3. 80 లక్షల చెక్కున అందజేశారు. తోటయ్య విద్యుత్ షాక్ కి గురై రెండు చేతులు కోల్పోయాడు. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనకు హాజరైన సందర్భంలో ఎమ్మెల్యే బడ్డుకొండ సిఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి 25 రోజులు వ్యవధిలోనే బాధిత కుటుంబానికి రూ. 3. 80 లక్షలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉప్పాడ అనూష రెడ్డి, నాయకులు ఉప్పాడ శివారెడ్డి, సర్పంచి ఉప్పాడ విజయ్ భాస్కర్, దల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.