ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుకు వెన్ను దన్నుగా రైతు భరోసా సాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 01, 2023, 04:08 PM

ఆరుగాలం శ్రమిస్తున్న రైతుకు వెన్ను దన్నుగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందిస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీట నొక్కి ఐదో ఏడాది తొలి విడత వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాలోని నగదు జమ కార్యక్రమం జరిగింది. పాలకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి వైయస్సార్ రైతు భరోసా, పిఎం కిసాన్ పెట్టుబడి సాయం విడుదల కార్యక్రమానికి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, స్థానిక శాసన సభ్యురాలు విశ్వరాయి కళావతి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ నూర్ కమల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు బాసటగా ప్రభుత్వం నిలుస్తుంది అన్నారు.

అటవీ హాక్కు పట్టాదారులకు రైతు భరోసా వర్తింప చేస్తుందన్నారు. జిల్లాలోని 306 రైతు భరోసా కేంద్రాలు నిరంతరంగా పనిచేస్తున్నాయన్నారు. ఆర్బికే ల ద్వారా రైతులకు తగు సూచనలు, సలహాలు భూ విత్తన పరీక్షలు అందించి వ్యవసాయం లాభసాటికి ప్రత్యేకమైన కృషి చేస్తున్నట్లు తెలిపారు. నూతన జిల్లా ఏర్పాటు అయినా ఏడాదిలోనే 130 రైతు భరోసా కేంద్రాల్లో కష్టం హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి 80 పైగా ట్రాక్టర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అనతి కాలంలోనే పెద్ద ఎత్తున కష్టమహరి సెంటర్లు ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. తక్కువ సమయంలో జిల్లాకు నాలుగు సార్లు జాతీయస్థాయిలో గుర్తింపురావడం క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజా సహకారంతో సాధ్యమైందని పేర్కొన్నారు.

కష్టంహైరింగ్ సెంటర్ ల ద్వారా రైతులు తక్కువ డబ్బులు చెల్లించి ఆధునిక యంత్ర పనిముట్లు వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐదవ ఏడాది మొదటి విడత క్రింద రైతులకు ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ. 7వేల500, రెండో విడత అక్టోబర్లో కరువు పంట కోత కొరకు, రభీ అవసరాలకు రూ. 4వేలు, మూడో విడత ధాన్యం ఇంటికి చేరే వేల సంక్రాంతి పండుగ సమయంలో రూ. 4 వేలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జిల్లాలో వరుసగా ఐదవ సంవత్సరం మొదటి విడట గా 1, 21, 418 రైతులకు పీఎం కిసాన్ కింద రూ. 24. 28 కోట్లు, వైయస్సార్ రైతు భరోసా కింద 124151 మంది భూ యజమానుల రైతులకు రూ. 68. 83 కోట్లు, 18779 మంది అటవీ భూమి సాగు చేస్తున్న లబ్ధిదారులకు రూ. 14. 08 కోట్లు వెరసి మొత్తం142930 రైతులకు రూ. 107. 19కోట్లు లబ్దిచేకురనున్నట్లు వెల్లడించారు. నియోజక వర్గం వారీగా పాలకొండ లో పీఎం కిసాన్ క్రింద 36683 మంది లబ్దిదారులకు రూ. 7. 34 కోట్లు, వైయస్సార్ రైతు భరోసా పథకం కింద భూయజమానులు 37107 మందికి రూ. 20. 49 కోట్లు, 3730 అటవీ భూమి సాగు దారులకు రూ. 2. 79 కోట్లు, మొత్తం 40837 మంది లబ్ధిదారలకు రూ. 30. 63 కోట్లు, సాలూరు - పీఎం కిసాన్ క్రింద 20337 మందికి రూ. 4. 03 కోట్లు, వైయస్సార్ రైతు భరోసా 20844 మంది భూ యజమానులకు రూ. 11. 57 కోట్లు, 5996 మంది అటవీ భూమి సాగుదారులకు రూ. 4. 49 కోట్లు వెరసి మొత్తం 26840 మందికి రూ. 20. 13కోట్లు, కురుపాం - పీఎం కిసాన్ 35171 మంది రైతులకు రూ. 7. 03 కోట్లు, వైయస్సార్ రైతు భరోసా 36135 మంది రైతులకు రూ. 20. 02 కోట్లు, 8502 మంది అటువైపు భూమి సాగుదారులకు రూ. 6. 37 కోట్లు , మొత్తం 44567 మంది రైతులకు రూ. 33. 43 కోట్లు, పార్వతీపురం - పీఎం కిసాన్ 121418 మంది రైతులకు రూ. 5. 85 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా 30135 మంది రైతులకు రూ. 16. 76 కోట్లు, 551 అటవీ భూమి సాగుదారులకు రూ. 0. 41 కోట్లు, మొత్తం 30686 మంది రైతులకు రూ. 23. 02 కోట్లు. జిల్లాలోని మొత్తం 121418 మంది పిఎం కిసాన్ లబ్దిదారులకు రూ. 24. 28 కోట్లు, వైయస్సార్ రైతు భరోసా కింద 124151 లబ్ధిదారులకు రూ. 68. 83 కోట్లు, 18779 మంది అటవీ సాగుదారులకు రూ. 14. 08 కోట్లు కాగా మొత్తం రూ. 107. 19 కోట్లు ఆయా రైతుల ఖాతాలో నగదు జమ అయినట్లు వివరించారు. 2019- 20 ఏడాదికిగాను 107729 మంది రైతు కుటుంబాలకు అన్ని విడతలు కలిపి రూ. 145. 43 కోట్లు, రెండో ఏడాది 129027 మంది రైతు కుటుంబాలకు రూ. 174. 19, మూడో ఏడాది 134657 మంది రైతు కుటుంబాలకు రూ. 181. 79 కోట్లు, 4 ఏడాది 139505 మంది రైతు కుటుంబాలకు రూ. 188. 04 కోట్లు, ఐదో ఏడాది మొదటి విడత 142930 మంది రైతు కుటుంబాలకు రూ. 107. 19 కోట్లు కలిపి మొత్తం రూ. 796 కోట్లు రైతులకు లబ్ధి చేకూరినట్లు తెలిపారు.

శాసన మండల సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ రైతు కుటుంబాల అభ్యున్నతికి, జీవన స్థితగతులను పెంపొందించేందుకు రైతు భరోసా పథకం రైతుల పాలిట వరం లాంటిదని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల అవసరాలను గుర్తించి అండగా నిలుస్తున్నాయన్నారు. రైతులు ఆధునిక యాంత్రికరణ పద్ధతులు పాటించి సకాలంలో వ్యవసాయ పనులు జరిగేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. పాలకొండ శాసనసభ్యురాలు కళావతి మాట్లాడుతూ రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందించి రైతులకు అండగా నిలుస్తుందని ఉన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నూర్ కమల్, నాగ వంశం కార్పొరేషన్ చైర్మన్ నల్లి శివ ప్రసాద్, పాలకొండ ఏ ఎమ్ సి చైర్మన్ యిమరక మోహన్ రావు, వైస్ చైర్మన్ పి. లక్ష్మణ రావు, నగర పంచాయితీ ఛైర్పర్సన్ రాధా కుమారి, వీరఘట్టం, సీతం పేట, భామిని మండల పరిషత్ అధ్యక్షులు దమలపారు వెంకట రమణ, బిడ్డిక ఆదినారాయణ, తోట శాంతి కుమారి, వీరఘట్టం, సేతం పేట, భామిని జెడ్ పి టి సి లు జంప కన్న తల్లి, సవర లక్ష్మి, బొడ్డే పల్లి చిన్నమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com