టీడీపీ మినీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.... వైసీపీ మేనిఫెస్టోను 98.5 శాతం అమలు చేసామని.. మేనిఫెస్టోని పవిత్రం గ్రంధం అని చెప్పి వైసీపీ నేతలు గ్రంధం చూడడం మానేశారని ఎద్దేవా చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం.. , ఆ తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు... ఇపుడు ఎన్నో దశలో ఉందో చెప్పాలన్నారు. వైసీపీ నేతల బుర్రలో చిప్స్ దొబ్బాయేమో.. అన్ని అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. రోజా టీడీపీలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారని, ఇప్పుడు వేదికలపై చిందులు వేసి.. టీడీపీని విమర్శిస్తున్నారని అన్నారు. ఏపిని గంజాయిలో నంబర్ 1గా నిలిపారని ఆరోపించారు.