కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం ఇంగ్లీష్పాలెంలో టీడీపీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారు. నిందితులను అరెస్టు చేయాలని చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట కొల్లు రవీంధ్ర ఆందోళనకు సిద్ధమయ్యారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. మరోవైపు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను తక్షణమే అరెస్టు చేయాలని కొల్లు రవీంధ్ర డిమాండ్ చేశారు.