ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలన అధికారిగా నియమితు లైన సిహెచ్. గోపీనాథ్ శుక్రవారం ఉదయం పోలీసు కార్యాలయంలో పరిపాలన అధికారి(ఏవో)గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ జి. ఆర్. రాధిక వారిని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈయన ఏలూరు పోలీసు కార్యాలయం నుంచి శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వచ్చారు.