శ్రీకాకుళం బలగ లో వెలసి ఉన్న శ్రీశ్రీశ్రీ బాలాత్రిపుర సుందరి కాలభైరవ పీఠానికి శ్రీభువనేశ్వరీ పీఠాధిపతులు పరమ హంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీకమలానంద భారతి స్వామీజీ విచ్చేసారు. శ్రీ శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠం వ్యవస్థాపకులు అమ్మవారి ఉపాసకులు గనేష్ గురూజీ అధ్యక్షతన గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కమలానంద భారతి స్వామీజీ వారు భక్తులను ఉద్దేశించి అభిభాషణం చేశారు. తరతరాల మన ఋషి సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవలసిన గురుతరమైన బాధ్యత మనందరిమీద ఉందని హిందూదర్మం పట్ల అందరం నిర్లక్ష్యం వహించడం వలన మన ఆచారాలు, సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయని అన్నారు. సదాచారాలు పాటించడం వలన మన జీవితాలు సుసంపన్నం అవుతాయని గ్రామదేవతల పట్ల మన దేవాలయాలపట్ల ప్రత్యేక శ్రద్ధవహించాలని మన వేద, పురాణ, ఇతిహాసాలను పూజ్యభావంతో అనుసరించాలని ఉపదేశించారు. సందేశం అనంతరం వేసవిలో బాల సంస్కార శిక్షణ పొందిన విద్యార్థులు భగవద్గీత ద్వాదదశోధ్యాయం పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో డబ్బీర్ వాసు, రెడ్డి గిరిజా శంకర్, అర్. కే. బాబు, చిట్టి లక్ష్మి సాదు రామారావు , చిట్టి రాజు, బౌరోతు రాజశేఖర్ గొద్దు భాస్కర్ జయలక్ష్మి పీఠం చిన్న గురువు జగన్ విష్ణు పీఠం సేవకులు భక్తులు పాల్గొన్నారు