రాజస్థాన్‌లో ఒకేసారి ఏడుగురు IAS, 30 మంది IPS అధికారులను అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం బదిలీ చేసింది. రాజస్థాన్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి రాజీవ్ శర్మను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్)గా నియమించారు. బదిలీ అయిన వారిలో ఉదయ్‌పూర్, జుంజును, భరత్పూర్, జైసల్మేర్, సిరోహి జిల్లాలకు చెందిన ఎస్పీలు ఉన్నారు.