రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా వాటికన్ సిటీలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా దగ్గరి బలిపీఠంపై నగ్నంగా నిల్చుని నిరసన తెలిపాడు. అతడి శరీరంపై స్వతహాగా చేసుకున్న గాయాలున్నాయని, వీపుపై ఉక్రెయిన్ పిల్లలను రక్షించాలని రాసుందని అధికారులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని ఇటాలియన్ పోలీసులకు అప్పగించామని వాటికన్ గార్డ్స్ చెప్పారు.