మానవ శరీర భాగాలతో కూడిన 45 సంచులు మెక్సికోలో బయటపడ్డాయి. జలిస్కో రాష్ట్రంలోని రెవైన్లో మే 20న అదృశ్యమైన ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషుల కోసం గాలిస్తున్న సమయంలో వీటిని కనుగొన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. తప్పిపోయిన వారందరూ ఒకే కాల్ సెంటర్లో పనిచేస్తున్నట్లు వివరించారు. బాధితుల గుర్తింపు కోసం శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్లు వెల్లడించారు.