ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్లో గత ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. తల్లిపక్కనే నిద్రపోతున్న బాలుడిని ఓ దుండగులు కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలో తల్లి కూడా నిద్రపోతోంది. బాలుడిని కిడ్నాప్ చేసిన వెంటనే అతడు ట్రైన్ ఎక్కి పరారయ్యాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడిని 24 గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. బాలుడిని కిడ్నాప్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.