రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ పై మహిళా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు. బ్రిజ్ భూషణ్ తమ టీషర్ట్స్ పైకి లేపి వక్షోజాలు, కడుపు భాగంలో చేతులతో తాకేవారని మైనర్ రెజ్లర్ FIRలో పేర్కొన్నారు. శ్వాసకు సంబంధించిన పరీక్ష పేరుతో టీషర్ట్ తీయాలని కోరినట్లు తెలిపారు. ఆయన బారి నుండి తప్పించుకునేందుకు గుంపులుగా వెళ్లేవారిమని వెల్లడించారు.