లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు జూలై 6 వరకు పొడిగించింది. లిక్కర్ స్కాం సీబీఐ కేసులో అనుబంధ చార్జ్‌షీట్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనీష్ సిసోడియాను కోర్టు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా నిందితులకు చార్జ్‌షీటు కాపీ, సంబంధిత పత్రాల కాపీని ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.