రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, నంద్యాల ,ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని, సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. కొత్తగా ప్రారంభం అయ్యే 5 మెడికల్ కాలేజీలు నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు.