తెలంగాణ సహా త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ, పోలీసు అధికారులను బదిలీ చేయాలని, వారికి సొంత జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వవద్దని సూచించింది. బదిలీ అయిన స్థలంలో బంధుత్వం లేదని అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని చెబుతున్నారు. క్రిమినల్ కేసులున్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, జూలై 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.