కోరమండల్ రైలు ప్రమాదంపై ప్రత్యక్షసాక్షి వివరాలు తెలిపారు. 'మాది రిజర్వేషన్ బోగీ అయినప్పటికీ జనరల్ లాగే రద్దీ ఉంది. నిద్ర రావడంతో పడుకున్నా, ప్రమాదం జరిగినప్పుడు మెలకువ వచ్చింది. పది, పదిహేను మంది నాపై పడిపోయారు. నా చేతికి, మెడకు గాయాలయ్యాయి. నేను బయటికి వచ్చేటప్పుడు కొందరికి కాళ్లు లేకపోవడం, చేతులు లేకపోవడం చూశాను. కొందరి ముఖాలు ఛిద్రమయ్యాయి' అని తెలిపారు.