ఒడిశాలో రైళ్లు ఢీకొని ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో సహాయక చర్యలు చేపట్టేందేకు సైన్యం రంగంలోకి దిగింది. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ సంఘటన స్థలానికి చేరుకోగా.. ఆర్మీ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా 3 రైళ్లు ఢీకొట్టుకోవడంతో మృతదేహాలు రైళ్ల శిథిలాల కింద చిక్కుకున్నాయి.