ఒడిశాలో రైలు ప్రమాదం ఎలా జరిగింది అనేది ఎన్నో సందేహాలను కలిగిస్తోంది. బహనాగా స్టేషన్ సమీపంలో ఆగిఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో 17 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, రైల్వే అధికారులు మరో రకమైన ప్రకటన ఇస్తున్నారు. కోరమండల్ రైలు బోగీలు పట్టాలు తప్పిన తర్వాత ఆ బోగీలను యశ్వంత్‌పూర్- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. కొంతమంది 2 రైళ్లు ఢీకొట్టుకున్నట్లు చెబుతుంటే మరికొందరు 3 రైళ్లు అంటున్నారు.