కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 8వ తేదీన విశాఖపట్నం రానున్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా తొమ్మిదేళ్లు పాలన పూర్తిచేసుకున్నందున నెల రోజులపాటు బీజేపీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో అమిత్ షా విశాఖ రానున్నారని పార్టీ నాయకులు తెలిపారు. ఆ రోజున విశాఖలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని చెప్పారు.