గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే స్పందించవద్దని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రజలకు సూచించారు. కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యల ఫలితంగా స్పామ్ కాల్స్, సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు భారీగా తగ్గినట్లు చెప్పారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయవద్దన్నారు. అలాగే తెలియని నంబర్ నుంచి మెసేజ్‌లు వచ్చినా స్పందించవద్దన్నారు.