ఒడిశాలో నిన్న జరిగిన కోరమండల్ ఎక్ ప్రెస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరింది. కాగా, ఈ ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 'ఈ ప్రమాదం చాలా దురదృష్టికరం. ప్రమాద వార్త రైల్వే శాఖకు తెలిసిన కాసేపట్లోనే సహాయక చర్యలు చేపట్టాం. అసలు ప్రమాదానికి మూల కారణమేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం' అని అన్నారు.