ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసుపత్రులు అలర్ట్‌గా ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 12:21 PM

 ఒడిశాలో రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని పంపించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంకైర్వీ విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. అవసరమైతే ఘటనా స్థలానికి పంపించడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం కావాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆసుపత్రులు అలర్ట్‌గా ఉండాలని అధికారులను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com