ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన దాదాపు 35 మంది మృతి చెందినట్టు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడు మంత్రుల బృందం ఒడిశాలోని రైలు ప్రమాద సంఘటనా స్థలానికి బయలు దేరింది. ఉదయనిధి స్టాలిన్‌తో కూడిన ముగ్గురు మంత్రుల బృందం అక్కడికి చేరుకోనున్నారు. కాగా సీఎం స్టాలిన్ తమిళ మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.