ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేరుకున్నారు. ప్రమాద స్థలిని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నాడు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణీ వైష్ణవ్, సీఎం నవీన్ పట్నాయక్ కు ప్రమాదం జరిగిన తీరును వివరించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.