ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మృతిచెందగా, మరో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, రైలు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. ప్రధాని నేడు ఒడిశాలోని బాలేశ్వర్ కు చేరుకొని ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. అనంతరం కటక్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు.