ఒడిశాలోని బాలేశ్వర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాల నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు, ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాల విదేశాంగ మంత్రులు సైతం రైలు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు.