ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు నెలల్లో రూ.32,363 కోట్ల లోటు ఏర్పడింది. మేలో మొత్తం ఆదాయం రూ.6,386 కోట్లు కాగా, వ్యయం రూ.26,576 కోట్లుగా నమోదుకావడంతో రూ.20,190 కోట్లు లోటుగా తేలింది. ఈలోటును బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా సేకరించిన దాదాపు రూ.15 వేలకోట్లతో, ఇతర సంస్థల నుంచి సేకరించిన మరో రూ.5 వేలకోట్లతో భర్తీ చేశారు.