ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రమాదానికి గురైన కొరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో అనేక మంది ఏపీ ప్రాంతవాసులు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వారి వివరాలపై సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు మంత్రి గుడివాడ అమర్నాథ్ రైలు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరారు. అలాగే స్పెషల్ స్పెషల్ కమిషనర్ అరుణ్ కుమార్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్, ప్రభుత్వం నుండి మరికొంత మంది సభ్యులు బయలుదేరి వెళ్లారు. ప్రమాదంలో మృతి చెందిన అలాగే గాయపడిన వారిని తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ బృందం ఘటనాస్థలికి పయనమయ్యారు.