రైల్వే చరిత్రలోనే ఘోర ప్రమాదం సంభవించింది. హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఒరిస్సాలోని బాలాసోర్ దగ్గరలోని బహానగర్ బజార్ స్టేషన్ సమీపంలో అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్ రైలును శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢీకొట్టింది. అదే సమయంలో పక్క ట్రాక్‌లో యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు యశ్వంత్‌పూర్ హౌరా రైలుకు తగి లాయి. దీంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 12 బోగీలు పట్టాయి. యశ్వంత్ పూర్ హౌరా రైలు 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఇప్పటిదాకా 237 మంది వరకు మరణించినట్లు తెలిసింది. కాగా 900 మందికి పైగా గాయపడిన ప్రయాణికులను బాలాసోర్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. మృతులకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం ఉదయం 7 గంటలకు రాజమహేంద్రవరం రావాల్సి ఉంది. ఈ రైలు నుంచి 53 మంది వరకూ రాజమహేంద్రవరంలో దిగాల్సి ఉంది. అయితే వీరి పూర్తి సమాచారం తెలియడం లేదు.