రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం పిలు పునిచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హిందూపురంలో ప్రారంభమైన బస్సు యాత్ర శుక్రవారం కర్నూలు నగరానికి చేరుకుంది. అశోక్‌నగర్‌లో జరిగిన సభలో నాగభూషణం మాట్లాడుతూ...... జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాక ముందు కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలైందన్నారు. క్లాప్ డ్రైవర్లకు రూ.9 వేల మాత్రమే జీతం ఇస్తున్నారని, రూ.18,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంఖ్యను పెంచి కార్మికులపై పనిభారం తగ్గించాలన్నారు.