పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కొన్ని వస్తువుల కోసం రష్యా, అఫ్ఘానిస్థాన్, ఇరాన్‌లలో వస్తుమార్పిడి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కింద పాకిస్థాన్‌లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ దేశాలతో వస్తుమార్పిడి వాణిజ్యం కొనసాగించగలవు. ఇలా చేయడం ద్వారా రష్యా నుంచి ఇంధనం, గోధుమలు, పప్పులు సహా పలు వస్తువులను పాక్ దిగుమతి చేసుకోగలుగుతుంది.