ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదం రేపింది. గత పదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇదే అతిపెద్ద ప్రమాదం కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మృతిచెందారు. మరో 900 మంది గాయపడ్డారు. ప్రమాద స్థలిలో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కుప్పలుగా మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.