ఒడిశా రాష్ట్రంలో శనివారం జరిగిన రైలు ప్రమాదం ఘటనపై పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందివ్వాలని, అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు కోరారు.