రెజ్లర్లకు 1983క్రికెట్ వరల్డ్కప్ విన్నింగ్ స్క్వాడ్ మద్దతు తెలుపుతోంది. తాజాగా ఆ స్వాడ్ ప్లేయర్ మదన్ లాల్ కూడా తన మద్దతు రెజ్లర్లకే అని చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి దీనిని న్యాయవ్యవస్థకు వదిలేస్తే బాగుటుందన్నారు. అనంతరం రెజ్లర్లు ప్రభుత్వంతో తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని, రాజకీయ పార్టీల ఎంట్రీతో ఇది రాజకీయ సమస్య అవుతుందని అన్నారు.