ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం రైల్వే మంత్రితో మాట్లాడిన ఆయన బాధితులను అవసరమైన సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఘటనా స్థలి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ప్రధాని కాసేపట్లో సంఘటనా స్థలికి చేరుకోనున్నారు. ఇప్పటికే మోదీ ఒడిశాకు పయనమైనట్లు సమాచారం.