ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బాలేశ్వర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘోరం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 278 మంది ప్రయాణికులు మృత్యువాతపడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బాధిత ప్రయాణికులు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa