ఒడిశా రైలు ప్రమాదంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో చాలా బాధపడ్డానని తెలిపారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు చంద్రబాబు హృదయపూర్వక సానుభూతి తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.