పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో బస్సు అదుపుతప్పి వేణుగోపాలస్వామి దేవాలయం గోడను ఢీకొట్టింది. సెంటర్లోని మలుపు దగ్గర లారీని తప్పించబోయి బస్సు దేవాలయంలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 49మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారంతా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బస్సులోని ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.