ఒడిశాలోని కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదం భారత రైల్వేలో అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. శుక్రవారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 280 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సరిగ్గా 14 ఏళ్ల కిందట కూడా కోరమాండల్ కు ప్రమాద ఘటనలో 16 మంది మృతి చెందారు. 2009, ఫిబ్రవరి 13న శుక్రవారం రాత్రి 7:30 నుంచి 7:40 మధ్య జరగడం గమనార్హం.