ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అధికారం చేపట్టి ప్రజలను మోసం చేశారని శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. శృంగవరపుకోట మండలం పోతనాపల్లి గ్రామంలో శనివారం శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జిఎస్ఎస్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టో గురించి గ్రామంలో మహిళలకు అలాగే ప్రజలకు విపులంగా వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఆర్థికంగా బలోపేతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పులు పాలు అయిందని విమర్శించారు. ఉద్యోగాలు లేక పరిశ్రమల స్థాపన లేక రాష్ట్రంలో యువత వలస వెళ్లిపోయే పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్నాయని ఆమె మండిపడ్డారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అకంటి విజయం చేకూరే విధంగా ప్రజలు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, జడ్పీటీసీ అభ్యర్థి బీశెట్టి అరుణ, ఎస్. కోట మండల టీడీపీ పార్టీ ప్రచార కార్యదర్శి ఇందుకూరి శ్రీను రాజు, నియోజకవర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి కిలపర్తి ముత్యాలనాయుడు, నియోజకవర్గ టి. యెన్. ఎస్. ఎఫ్. ఉపాధ్యక్షులు గుమ్మడి గణేష్, గొర్రిపోటు రోహిణి కుమార్, మోపాడ చిన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ పెద్దలు, మహిళలు, యువత మరియు తదితరులు పాల్గొన్నారు.