జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ సక్రమంగా చేయాలని గజపతినగరం మండల ప్రత్యేక అధికారి రమేష్ ఆదేశించారు. శనివారం గజపతినగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న జెవికె కిట్లను మండల ప్రత్యేక అధికారి రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ జె. వీ. కే కిట్లను ప్రత్యేక వాహనం ద్వారా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం నుంచి పంపిణీ చేయడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి విమలమ్మ ప్రత్యేక అధికారికి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పప్పు సుదర్శనం, తహసిల్దార్ మరడాన అరుణకుమారి, మండల విద్యాశాఖ అధికారి విమలమ్మ, సిఆర్పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.