ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు 7 గంటల బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తన భార్యను కలిసేందుకు శనివారం దేశ రాజధానిలోని తన నివాసానికి చేరుకున్నారు. భార్య అనారోగ్యం దృష్యా ఆప్ నేతకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిసోడియా మీడియాతో మాట్లాడకూడదని, కుటుంబ సభ్యులు కాకుండా, ఇతర వ్యక్తులను కలవకూడదని జస్టిస్ దినేష్ కుమార్ శర్మ సూచించారు.