ఒడిశా రైలు ప్రమాదంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు బాధ్యతను తామే తీసుకుంటామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర మనో వేదనకు గురి చేసింది. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుంది. బాధితులకు, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని ట్వీట్ చేశారు.