ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిగ్నలింగ్ లోపం వల్ల ఈ ఘటన జరిగింది,,,రైల్వే బోర్డు వెల్లడి

national |  Suryaa Desk  | Published : Sun, Jun 04, 2023, 10:16 PM

ఒడిశాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో 294 మంది దుర్మరణం చెందారు. మరో 1,175 మందికి పైగా గాయపడగా.. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో గంటకు 130 కి.మీ. వేగంతో వస్తున్న కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.. లూప్ లైన్‌లోకి వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టింది. ఈ వేగానికి 113 టన్నుల బరువున్న రైలు ఇంజిన్.. 15 అడుగుల ఎత్తులోకి ఎగిరి గూడ్సు మీదకి ఎక్కింది. బోగీలు పక్కనే ఉన్న మెయిన్ ట్రాక్‌పై పడిపోవడంతో అదే సమయంలో ఆ మార్గం గుండా వేగంగా యశ్వంత్‌పూర్-హౌరా సూపర్‌ఫాస్ట్ రైలు దూసుకొచ్చింది. దీంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది.


సిగ్నలింగ్ లోపం వల్లే ప్రమాదం జరిగినట్టు రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తాజాగా, ఈ ప్రమాదంపై రైల్వే బోర్డు సభ్యురాలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో గూడ్సు రైలు పట్టాలు తప్పలేదని, అందులో ఇనుప ఖనిజం ఉండటం వల్ల దాన్ని ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై పెను ప్రభావం పడిందని రైల్వే బోర్డు సభ్యురాలు (ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) జయవర్మ సిన్హా అన్నారు.


‘ఒడిశా రైలు ప్రమాద ఘటనలో గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదు. గూడ్సు వ్యాగన్లలో ఇనుప ఖనిజం ఉన్నందున.. దాన్ని ఢీకొన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఇది భారీ సంఖ్యలో మరణాలు, గాయాలకు దారితీసింది. ఈ క్రమంలోనే పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు డౌన్‌లైన్‌లోకి వచ్చి.. దానిపై 126 కి.మీ వేగంతో వెళ్తోన్న యశ్వంత్‌పూర్- హౌర్ ఎక్స్‌ప్రెస్ చివరి రెండు బోగీలను ఢీకొట్టాయి’ అని రైల్వే బోర్డు ) సభ్యురాలు జయవర్మ సిన్హా వెల్లడించారు. సమాచారం కోసం బాధిత కుటుంబాలు హెల్ప్‌లైన్ నంబర్ 139ను సంప్రదించాలని ఆమె సూచించారు. వారి ప్రయాణం, ఇతర ఖర్చులను రైల్వే పూర్తిగా భరిస్తుందని ఆమె స్పష్టం చేశారు.


సిగ్నలింగ్‌ లో లోపం వల్ల రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని రైల్వే బోర్డు (Railway Board) తెలిపింది. అయితే, ఈ ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందని వెల్లడించింది. ప్రమాద సమయానికి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దాదాపు గంటకు 128 కి.మీ వేగంతో ఉన్నట్లు పేర్కొంది. అయితే, అతి వేగం ప్రమాదానికి కారణం కాదని వివరించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com