ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై మతం రంగు పులిమే వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసుల వెల్లడి

national |  Suryaa Desk  | Published : Sun, Jun 04, 2023, 10:16 PM

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొని 288 మంది ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటనపైనా కొంతమంది మతం ఆటలు ఆడుతున్నారు. ఈ ఘోర ప్రమాదానికి ఓ మతం కారణమనే విధంగా అర్థం వచ్చేటట్లు పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పోస్టులకు లైక్‌లు, షేర్లు రావడంతో వైరల్‌గా మారాయి. ఘటన జరిగింది శుక్రవారం అని.. ఆ రోజు ఒక మతానికి పవిత్రమైన రోజు అని ట్వీట్లు చేస్తున్నారు. అయితే ప్రమాద స్థలానికి పక్కనే ఓ మతానికి చెందిన భవవనం ఉందని పోస్టులు పెడుతున్నారు. అనుకూల, వ్యతిరేక పోస్టులతో సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.


సోషల్ మీడియాలో ఒడిశా ప్రమాదంపై జరుగుతున్న పోస్టులపై ఆ రాష్ట్ర పోలీసులు స్పందించారు. అదంతా ఒక అసత్య ప్రచారం అని తేల్చారు. సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నట్లుగా ఘటనాస్థలానికి పక్కన ఉన్న భవనం ఆ మతానికి సంబంధించింది కాదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎవరైనా మత పరమైన పోస్టులు పెడితే ఊరుకునేది లేదని ఒడిశా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టడం, ఆ రకంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇలాంటి దుర్ఘటనపై అసత్య, చెడు ప్రచారంతో చేస్తున్న పోస్టులను షేర్ చేయవద్దని ప్రజలకు సూచించారు. మూడు ఈ మేరకు ఒడిశా పోలీసులు వరుస ట్వీట్లు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com