విశాఖలోని సాగర్ నగర్ బీచ్ రోడ్ సమీపంలో బోగాపురం మండలం కొండరాజుపాలెంకి చెందిన భార్యా భర్తలు మైలపల్లి పెద్దయ్య, పావని తమ మూడేళ్ల పాపతో బైకేపై ప్రయాణిస్తుండగా ప్రమాదశాత్తూ ఆదివారం రాత్రి చెట్టును ఢీకొని పెద్దయ్య అక్కడికక్కడే మృతి చెందగా బార్య గీతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. పాపకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు వెల్లడిస్తామని అన్నారు.