ఐస్‌క్రీం తిని 70 మంది అస్వస్థతకు గురైన ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి దుదారి పంచాయతీలో జరిగింది. పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఓ వ్యక్తి ఐస్‌క్రీం విక్రయించాడు. నిద్రపోయే సమయంలో ఐస్‌క్రీం తిన్నవారందరూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వారిని సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. నిల్వవున్న ఐస్‌క్రీం తినడంతో అది ఫుడ్ పాయిజన్‌గా మారిందని వైద్యులు తెలిపారు.