వచ్చే ఎన్నికల్లో తెనాలి జనసేన అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో నాదెండ్ల మనోహర్ బరిలో నిలవటం ఖాయమైందని సమాచారం. ఇక్కడి లోకల్ టీడీపీ నేత ఆలపాటి రాజాను ఇప్పటికే ఈదిశగా చంద్రబాబు ఒప్పించినట్లు తెలుస్తోంది. 2019లో 17వేల ఓట్ల తేడాతో ఇక్కడ టీడీపీ ఓడిపోగా, జనసేన అభ్యర్థిగా నాదెండ్లకు 30 వేల ఓట్లొచ్చాయి. స్థానికుడిగా, జనసేన కీలకనేతగా ఉన్న మనోహర్‌కు సామాజికవర్గమూ కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.